సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ!
ఉమేష్, రమేష్‌తో పాటు పలువురు నాయకుల హస్తం గూటికి..
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న నాయకులు
ఏదులాపురం, వరంగల్ క్రాస్‌రోడ్డులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీలో సీపీఐకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా 32వ వార్డు సీపీఐ డివిజన్ సహాయ కార్యదర్శి పొన్నం ఉమేష్ నాయుడు, 31వ వార్డు నాయకుడు పొన్నేకంటి రమేష్‌తో పాటు పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి పొంగులేటి నాయకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను కాంగ్రెస్ వైపు ఆకర్షించాయని చేరిన నాయకులు పేర్కొన్నారు. ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండటంతో ఇతర పార్టీల నాయకులు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వరుస చేరికలతో ఏదులాపురం రాజకీయాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుండగా, సీపీఐలో మాత్రం కలవరం మొదలైంది.
కాంగ్రెస్‌లో చేరిన వారిలో: పొన్నం ఉమేష్, పొన్నేకంటి రమేష్, బుద్ధి నాగమణి, ఇస్లావత్ కిషోర్, ఇస్లావత్ పవన్, బానోత్ నవీన్, భాగం మురళీకృష్ణ, మోదాల సంపత్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పి. అనిత, కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్, ఉపాధ్యక్షుడు వెంపటి సురేష్, బీసీ సెల్ అధ్యక్షుడు వెంపటి రవి, గణపారపు వీరన్న, పొన్నేకంటి నర్సింహారావు, రామిశెట్టి రమేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు రెబ్బగొండ్ల గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.