BREAKING
శ్రీకృష్ణ కాన్సెప్ట్ స్కూల్లో ముందస్తు బాలల దినోత్సవం ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు! ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు! ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ.. జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక ఆర్వోలకు సమీక్ష మిట్స్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : స్వచ్చంధంగా పాల్గొన్న విద్యార్థులు,అధ్యాపకులు మిట్స్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : స్వచ్చంధంగా పాల్గొన్న విద్యార్థులు,అధ్యాపకులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీవో సంఘం రాజీలేని పోరాటం ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు : ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా చీర అలంకారం బిల్లులు చెల్లించకుంటే పనులు బంద్‌.. టెండర్లకూ దూరం! మహిళ అదృశ్యం కేసు నమోదు పదేళ్ల పాలనలో రైతులను ముంచింది ఎవరో ప్రజలకు తెలుసు!రసమయి బాలకిషన్‌కు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం కౌంటర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్

Select Suryaa Now
హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్

(రంగారెడ్డి మేజర్ న్యూస్ ): తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీ ముందుగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘గో బ్యాక్ రాహుల్ గాంధీ’ నినాదంతో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తూ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఎన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారో స్పష్టం చేయాలని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

హైడ్రా చర్యల్లో వివక్ష ఎందుకు?

హైడ్రా పేరుతో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యలు చేపట్టడం మంచిదేనని, అయితే ఆ పేరుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండకూడదన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణల వెనుక ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో భూకబ్జాల ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో అనుసరిస్తున్న రాజకీయ వైఖరిపై కూడా రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని అన్నారు.

ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడతారు? ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు పరిస్థితిపై శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారు? హైడ్రా చర్యల్లో అందరికీ సమాన న్యాయం జరుగుతుందా? ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలకు పాల్పడిన పెద్దలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? బీజేపీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటి? మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు నిర్దిష్ట గడువు ఏమిటి? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు బాధ్యతను రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా తీసుకుంటారా? అంటూ ఏడు ప్రశ్నలను సంధించారు.

ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితి, మహిళల భద్రత, రైతుల సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులు, పెరుగుతున్న ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధాని పదవిని ఆశించే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో పాలన ఎలా సాగుతుందో రాహుల్ గాంధీ సమీక్షించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా భారత్ సమ్మిట్‌లో ప్రసంగాలు చేయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

మాటలు కాదు.. చేతల్లో పాలన కావాలి

తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హేమా సుదర్శన్ జిల్లోజు స్పష్టం చేశారు. లేకపోతే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వడ్ల శ్రీనివాసచారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్