BREAKING
పొదలకూరు రైతు బజార్‌లో ప్రత్యేక రైస్ కౌంటర్ పరిశీలన అగ్నిప్రమాద భయంతో 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ప్రైవేట్ పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్...... సిద్ధలకోనలో 167 నూతన నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం వైభవం! వేద మంత్రోచ్ఛారణల నడుమనాగశిలలకుప్రాణప్రతిష్ఠ.. ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ రామాయణం మహేష్ స్వామి కోరిటికల్‌లో అంగన్వాడీ భవనం ప్రారంభం. : ఫుట్ బాల్ క్రీడాకారిని భానోత్ శైలజకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయం శ్రీ గాయత్రి స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం! ఎస్.ఈ.ఐ.ఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీకి 25 ఎంపీటీసీ స్థానాలు క్లైమేట్ ఫైనాన్స్ కోసం రూ. 10 బిలియన్ల ప్రత్యేక భాగస్వామ్యం ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి మంత్రి ఆనంను కలిసిన విజేతలు, నాయకులు తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కల్వకుంట్ల కవిత. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఏవీఎం కేర్ ఆసుపత్రి ప్రారంభం ఘనంగా నాగుల చవితి వేడుకలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీవో సంఘం రాజీలేని పోరాటం

Select Suryaa Now
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీవో సంఘం రాజీలేని పోరాటం

జగ్గయ్యపేట, మేజర్ న్యూస్:ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ రాజీలేని పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ, వారి న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధనకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. శుక్రవారం జగ్గయ్యపేటలోని ఫుడ్ ప్లాజా ఫంక్షన్ హాల్‌లో వత్సవాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా హెల్త్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన బొల్లేపల్లి ఉషారాణికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ  లు బి .ఉషారాణి దంపతులను డు దుశ్శాలువ , పూలమాలలతో ఘనంగా సన్మానించారు 
  ఈ సందర్భంగా రాష్ట్ర  అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఎ పి ఎన్ జి జి ఓ సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలు తో పాటు పలు దఫాలు గా రాష్ట్ర ప్రభుత్వం తో జరిపిన చర్చలు ఫలితం గా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం, రెండు విడతల  డీఏలు విడుదల చేయడం, 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుకు అంగీకరించడం స్వాగతించదగిన పరిణామాలని తెలిపారు.
అదేవిధంగా అర్హులైన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేయడం ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర ఆర్థిక ప్రయోజనాల బకాయిల చెల్లింపులపైనా ప్రభుత్వం దృష్టి సారించడం అభినందనీయమన్నారు.
అయితే ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించాలని, డీఏ బకాయిలను నిర్ణీత గడువులోగా విడుదల చేయాలని, పెన్షన్ విధానానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగుల ఇతర దీర్ఘకాలిక డిమాండ్లను కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలకు సహకరిస్తూనే, ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు ఏపీ ఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి వి రమణ మాట్లాడుతూ 
బొల్లేపల్లి ఉషారాణి ఉద్యోగిగా ప్రజలకు విశేష సేవలందించడంతో పాటు సంఘ అభివృద్ధికి, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సంఘటిత శక్తిని పెంపొందించేందుకు చేసిన కృషి అభినందనీయమని అన్నారు గ్రామీణ ప్రజారోగ్య పరిరక్షణలో, మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యలను సంఘం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆమె సేవలు నేటి యువ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

  సన్మాన గ్రహీత బి.ఉషారాణి మాట్లాడుతూ, తనకు ఇంతటి ఆత్మీయ సన్మానం చేసిన రాష్ట్ర నాయకులకు, సహోద్యోగులకు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.


కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రజనీష్ బాబు ప్రచార కార్యదర్శి బి.జానకి అల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం సబ్ కమిటీ కన్వీనర్ రాజ్య లక్ష్మి మాజీ రాష్ట్ర కార్యదర్శి తులసి బి.రత్నం ఎన్ టి ఆర్ జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రమేష్, సహాధ్యక్షుడు వి వి ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు రాటకొండ శ్రీనివాసరావు, విజయవాడ నగరశాఖ కార్యదర్శి ఎస్ కె నజీరుద్దీన్,జగ్గయ్యపేట తాలూకా అధ్యక్షులు ఎ. కుమార్, కార్యదర్శి టి. బాబురావు, యూటీఎఫ్ నాయకులు ఎం. కృష్ణయ్య, నెలవల్లి రమేష్ బాబు, ఆర్టీసీ సంఘం నాయకులు ఘంటా భాస్కరరావు సచివాలయ ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉషారాణి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అనంతరం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణలను జగ్గయ్యపేట ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.