జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక
సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన జాతీయస్థాయి సాహిత్య పోటీల్లో అక్షయ రాసిన కవితఎంపికైంది.శుక్రవారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దండు అక్షయ జాతీయస్థాయి పోటీలో ప్రతిభ చాటుకుంది.ఈ నెల 22న తెలంగాణ సారస్వత పరిషత్తులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అక్షయకు రూ.500 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు.విద్యార్థినిలోని సాహిత్య ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయులు పిన్నింటి మహేంద్రారెడ్డిని, విద్యార్థిని అక్షయను పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎ. శ్రీనివాసులు, మండల విద్యాధికారి ఎం. గౌరీమోహన్, గ్రామ సర్పంచ్ పోతుల రమేష్, ఏఏపీసీ చైర్మన్ మేకల ప్రమీలతో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థిని మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
(సూర్య రూరల్, రమేష్)