BREAKING
అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు నేటి బాలలే.. రేపటి భావి పౌరులు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..పథకం విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఘనంగా నాగుల చవితి వేడుకలు

ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

Select Suryaa Now
ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

విజయవాడ, మేజర్ న్యూస్ : రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికులు, ఇతర వాహనదారుల భద్రతే లక్ష్యంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాలు, డీసీపీ ట్రాఫిక్ షిరీన్ బేగం సూచనల మేరకు శుక్రవారం బెంజ్ సర్కిల్ వద్ద ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఐదో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి.వి. రమణ ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. విధి నిర్వహణ సమయంలో తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఆటోల వెనుక వైపు ఉండే కర్టెన్లను ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలని, తద్వారా ఇతర వాహనదారులకు ఆటోలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ఐదో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.