సరస్వతి పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ కార్యక్రమాలు
వింజమూరు, మేజర్ న్యూస్ : బాలల దినోత్సవం పురస్కరించుకొని వింజమూరు నడుమూరు నందలి శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల నందు ముందస్తు కార్యక్రమాలను నిర్వహించారు పిల్లలకు ఇష్టమైన కార్యక్రమం కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలు అంకిరెడ్డి ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఎంతో ఉల్లాసంగా నిర్వహించారు ఉదయాన్నే పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులకు కబడ్డీ వాలీబాల్ రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహించారు అలాగే ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఫ్రాగ్ కాంపిటేన్స్ లెమన్ స్పూన్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు వారికి కూడా కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాలను విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా సంతోషభరితంగా ఆనందదాయకంగా జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆటల పోటీలలో చూపిన ఉత్సాహాన్ని చదువులో కూడా చూపించి రానున్న ఎస్ఏ వన్ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అలాగే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రావాలని ఆ దిశగా కృషి చేయాలని విద్యార్థులకు సూచన చేశారు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం లో నడిచి చక్కగా చదివి తల్లిదండ్రుల యొక్క ఆశలను ఆశయాలను నెరవేర్చాలని కోరారు అదేవిధంగా మీ భవిష్యత్తుకు మీ విద్య మూలమవుతుందని కావున తప్పక చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ఫలితాలను సాధించాలని ఆయన కోరారు విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు