ఘనంగా నాగుల చవితి వేడుకలు
వింజమూరు, మేజర్ న్యూస్ : వింజమూరు మండల పరిధిలో నాగులచవితి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే మహిళలు తడి దుస్తులపై పుట్ట దగ్గరకు వెళ్లి పొట్ట చుట్టూ నీరు పోసి పొట్ట చుట్టూ తెల్ల దారాన్ని చుట్టే పసుపు కుంకుమ చందనం చల్లి ఆ పుట్టను పూజించారు తరువాత ఇంటి దగ్గర నుండి పాలు సజ్జలు నైవేద్యంగా తీసుకుని వెళ్లి ఆ పుట్టలో పాలు పోసి ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టారు నాగుల చవితి అనగా దీపావళి వెళ్లిన తర్వాత వచ్చే తిథి నాగుల చవితిగా భావిస్తారు అంటే నాగదేవతలను ఆరాధించే రోజుగా ఈ పండుగను నిర్వహిస్తారు నాగదేవతలు దేవసర్పాలుగా తక్షకి వాసుకి కర్కోటక మొదలైన 12 దేవతా సర్పాలను పూజించే విధంగా ఈ నాగుల చవితి జరుపుకుంటాము అంటే ఈ నాగులు సంతానాన్ని కలిగించే విధంగా కుటుంబాన్ని సంక్షేమంగా ఉండే విధంగా కాపాడుతారని భక్తుల విశ్వాసం అందుచేతనే ఆ పుట్టలో పాలు పోసి నాగదేవత ఫాలారగించమని నాగదేవతను ప్రార్థిస్తారు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుంది నేను నమ్మకం భక్తుల్లో విశ్వాసంగా ఉన్నారు.