కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా చీర అలంకారం
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :-
అనంతపురం హెచ్.ఎల్.సి. కెనాల్ వద్ద కొలువైన శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టా శ్రీలత, చిట్టా శ్రీధర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేకంగా చీర అలంకారం చేయించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు విజయకుమార్ భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..