ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు : ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ
మదనపల్లి,మేజర్ న్యూస్ : ఫోర్డ్,క్రై సంస్థలు ప్రతిష్టాత్మకంగా సంయుక్తంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా మున్సిపల్ హైస్కూల్ వాల్మీకి నగర్,దివ్య జ్యోతి మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వడ్డేపల్లి ప్రాంతాల్లో విద్యార్థులచే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.పోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు బాలల దినోత్సవం నుండి బాలల హక్కుల దినోత్సవం వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.అనంతరం బాలల సంఘాల సభ్యులచే అనేక రకాలైనటువంటి నృత్య పోటీలు,వ్యాసరచనలు డ్రాయింగ్ తర్వాత సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి వారికి ప్రోత్సాహక బహుమతులను అందించడం జరుగుతుందన్నారు.బాలల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసి,మెరుగుపరచడమే కాకుండా బాలల హక్కుల పరిరక్షణ కార్యక్రమాలను బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు,ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,ఉపాధ్యాయులు,అంగన్వాడి వర్కర్లు,సిబిఓ సభ్యులు పిసి నిర్మల,ఎంఐఎస్ గౌరీ,శ్యామల,సుభాషిణి,స్వర్ణలత,ఎం.నరసింహ విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి