BREAKING
కోరిటికల్‌లో అంగన్వాడీ భవనం ప్రారంభం. : ఫుట్ బాల్ క్రీడాకారిని భానోత్ శైలజకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయం శ్రీ గాయత్రి స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం! ఎస్.ఈ.ఐ.ఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీకి 25 ఎంపీటీసీ స్థానాలు క్లైమేట్ ఫైనాన్స్ కోసం రూ. 10 బిలియన్ల ప్రత్యేక భాగస్వామ్యం ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి మంత్రి ఆనంను కలిసిన విజేతలు, నాయకులు తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కల్వకుంట్ల కవిత. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఏవీఎం కేర్ ఆసుపత్రి ప్రారంభం ఘనంగా నాగుల చవితి వేడుకలు ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు నైజీరియాలో ముగిసిన 21 రోజుల ఎబోలా కాంటాక్ట్ మానిటరింగ్ గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ

ఆర్వోలకు సమీక్ష

Select Suryaa Now
ఆర్వోలకు సమీక్ష

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి(ఆర్వో) పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని.. రిటర్నింగ్ అధికారిగా నియమించబడిన వారు ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై అవగాహనతో, అప్రమత్తంగా వ్యవహరించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. రిటర్నింగ్ అధికారులతో శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని.. కావున ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ నుండి ఫలితాల ప్రకటన వరకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలని, మోడల్ కోడ్ ప్రతులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అందించి వాటిని అమలు చేసేలా చూడాలని, ఎన్నికల ఖర్చుకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలని, అభ్యర్థుల అఫిడవిట్లు, నేర చరిత్ర పరిశీలించాలని, అనర్హతకు సంబంధించిన రూల్స్ పై పట్టు ఉండాలన్నారు. అలాగే పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అన్నారు. కనుక ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలిస్తూ, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.