BREAKING
బెదిరింపులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తిరుణాల తిప్ప వద్ద ఘనంగా నాగుల చవితి వేడుకలు ప్రమాదాలకు నిలయంగా ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలి? రక్షణ చర్యలు చేపట్టేది ఎప్పుడు? పొదలకూరు రైతు బజార్‌లో ప్రత్యేక రైస్ కౌంటర్ పరిశీలన అగ్నిప్రమాద భయంతో 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ప్రైవేట్ పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్...... సిద్ధలకోనలో 167 నూతన నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం వైభవం! వేద మంత్రోచ్ఛారణల నడుమనాగశిలలకుప్రాణప్రతిష్ఠ.. ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ రామాయణం మహేష్ స్వామి కోరిటికల్‌లో అంగన్వాడీ భవనం ప్రారంభం. : ఫుట్ బాల్ క్రీడాకారిని భానోత్ శైలజకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయం శ్రీ గాయత్రి స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం! ఎస్.ఈ.ఐ.ఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీకి 25 ఎంపీటీసీ స్థానాలు క్లైమేట్ ఫైనాన్స్ కోసం రూ. 10 బిలియన్ల ప్రత్యేక భాగస్వామ్యం ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి మంత్రి ఆనంను కలిసిన విజేతలు, నాయకులు

మిట్స్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : స్వచ్చంధంగా పాల్గొన్న విద్యార్థులు,అధ్యాపకులు

Select Suryaa Now
మిట్స్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం : స్వచ్చంధంగా పాల్గొన్న విద్యార్థులు,అధ్యాపకులు

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని  ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ (తిరుపతి),హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మదనపల్లె వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మిట్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,వైస్ ప్రిన్సిపాల్ (అడ్మినిస్ట్రేషన్) డాక్టర్ సి.కమల్ బాషా,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మణికంఠ నాయుడు,ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ తిరుపతి కో-ఆర్డినేటర్ రవి,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,ఒకరి ప్రాణాలను కాపాడటానికి రక్తదానం ఎంతో గొప్పదానమన్నారు.రక్తదానం అనేది నిస్వార్థమైన సేవతో పాటు సమాజంలోని ప్రతిపౌరుడి సామాజిక బాధ్యత అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని,అలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటమే కాకుండా రక్తదాతల్లో కూడా సేవాభావం,సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు.విద్యార్థులు రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని,వైద్యుల సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొత్తం 154 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలందరికీ ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ రాజేష్,ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి