*షాద్‌నగర్‌లో రేపు పలు కాలనీల్లో 4 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేత...
షాద్‌నగర్‌లో రేపు 4 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేత…
షాద్నగర్ పట్టణంలోని పలు కాలనీలలో విద్యుత్ మరమత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ షాద నగర్ పట్టణ ఏఈ జి. వినోద తెలిపారు. శనివారం 11కేవీ షాద్‌నగర్ టౌన్ ఫీడర్‌లో మరమ్మతు పనులు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ తెలిపింది.
దీని కారణంగా షాద్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది అని మెయిన్ రోడ్, ఆశా కాలనీ, పోలీస్ స్టేషన్ ఏరియా, గాంధీనగర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ, ఇందిరానగర్ తదితర కాలనీలలో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు విద్యుత్ శాఖ సహకరించాలని మరమ్మతుల అనంతరం తిరిగి యధావిధిగా విద్యుత్ సరఫరాను అందిస్తామని అంతరాయానికి చింతిస్తున్నట్లు ఏఈ జి. వినోద్ కోరారు.