BREAKING
దేశ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసిన కజకిస్తాన్ అధ్యక్షుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దళారీ దందా.... సీఓపీ31 సదస్సులో క్లైమేట్ ఫైనాన్స్ డిమాండ్లు పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' మూవీ రివ్యూ సీసీ రోడ్లు,ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన రేపల్లె నుంచి దూర ప్రాంతాలకు రైలు సర్వీసులు ప్రారంభించాలి ప్రయాణికుల అవసరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి పట్టణ ఆదర్శ వేదిక కార్యదర్శి యడ్లపల్లి కిషోర్ బాబు విజ్ఞప్తి నేడుధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు రోబోటిక్ సర్జరీతో మెరుగైన వైద్య సేవలు.. తక్కువ కోతలతో వేగవంతమైన కోలుకోవడం! నార్వే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ "విజేతలకు అభినందనలు, యోధులకు జే జే లు - కాకాణి" పిల్లలు సొంతంగా సొంత దారులను వెతుక్కోవాలి.. సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు భిన్నత్వంలో ఏకత్వమే పటాన్‌చెరు ప్రత్యేకత మోపిదేవి చంద్రం మృతి పట్ల టీడీపీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్ సంతాపం

బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని స్థానిక సంతపేట నాగాలమ్మ గుడి సమీపంలో గల బృందావన్ సెకండరీ స్కూల్ లో శుక్రవారం  బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్  డాక్టర్  శైలజ కుమారి , డైరెక్టర్లు  ప్రియతేజ ,  హిమజ  ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి, బాలల ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో   భాగంగా విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలను నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, ప్రశంసా పత్రాలను అందించి ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో   పాఠశాల ప్రిన్సిపాల్  టీ.వీ. సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు ఇతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.