రోబోటిక్ సర్జరీతో మెరుగైన వైద్య సేవలు.. తక్కువ కోతలతో వేగవంతమైన కోలుకోవడం!
వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో శస్త్రచికిత్స విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోబోటిక్ సర్జరీ విధానం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడుతోంది.పెల్విక్ అవయవాలు కిందకు జారే సమస్యలకు చికిత్సలో భాగంగా ఎంపిక చేసిన రోగులకు రోబోటిక్ సహాయంతో శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చు. అలాగే గైనకాలజీ క్యాన్సర్ చికిత్సల్లోనూ రోగి పరిస్థితిని అంచనా వేసి రోబోటిక్వ ధానాన్ని ఉపయోగించవచ్చు.సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో చిన్న చిన్న కోతలు మాత్రమే ఉంటాయి. దీంతో శస్త్రచికిత్స అనంతరం తక్కువ నొప్పి, ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండే అవకాశం, త్వరగా సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రయోజనాలు ఉంటాయి.అయితే ప్రతి రోగికి రోబోటిక్ సర్జరీ అవసరం ఉండదు. రోగి ఆరోగ్య పరిస్థితి, గతంలో జరిగిన శస్త్రచికిత్సలు, వ్యాధి తీవ్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత వైద్యులు తగిన చికిత్సా విధానాన్ని ఎంపిక చేస్తారు.ఆధునిక వైద్యం.. అత్యాధునిక సాంకేతికత.. రోగులకు మెరుగైన ఆరోగ్యం అందించడమే యశోద హాస్పిటల్ లక్ష్యం అని డాక్టర్ అనిత అన్నారు.