వైయస్సార్ సీపీ నాయకుడు ఆదినారాయణ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండల పరిధిలోని సుశీల్ రెడ్డి కాలనీకి చెందిన వైయస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి సుశీల్ రెడ్డి కాలనీకి చేరుకున్నారు.
ఆదినారాయణ భౌతికకాయంపై పూలమాల వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదినారాయణ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి స్మరించుకున్నారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.