BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20 వరకు ఏ.బి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ

Select Suryaa Now
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20 వరకు ఏ.బి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ

రేపల్లె మేజర్ న్యూస్: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో రేపల్లెలోని శ్రీ ఏ.బి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి. రవిచంద్ర కుమార్ తెలిపారు. నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.సి. రవిచంద్ర కుమార్ మార్గదర్శకత్వంలో, గ్రంథాలయ శాస్త్ర విభాగ ఇన్‌ఛార్జి డాక్టర్ ఎం. దాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు పఠన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా పలు విద్యా సంబంధిత కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు, పుస్తక సమీక్షలు, గ్రంథాలయ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులపై ప్రజెంటేషన్లు, పుస్తక ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుస్తక పఠనం మనిషి ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా, విజ్ఞానాన్ని విస్తరించడానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి. రవిచంద్ర కుమార్ పేర్కొన్నారు. నేటి డిజిటల్ యుగంలో కూడా పుస్తక పఠనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తాయని వివరించారు.విద్యార్థులు ఈ వారోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని, వివిధ పోటీల ద్వారా తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన సూచించారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ నిరంతర అధ్యయనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడటమే ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి. రవిచంద్ర కుమార్ తెలిపారు.