ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
తిరుపతి జిల్లా లో రానున్న 2026 గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక నగదు మొత్తాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జి.ఓ.ఆర్.టి. నెం.1111, తేదీ 13.11.2026ను జారీ చేసింది.ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీల జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహక నగదు మొత్తాలను క్రింది విధంగా నిర్ణయించారు.
గ్రామ పంచాయతీ జనాభా ప్రోత్సాహక నగదు
-------------
2,000 లోపు జనాభాకు రూ.15 లక్షలు
2,001 – 5,000 లోపు జనాభాకు రూ.15 లక్షలు
5,001 – 10,000 లోపు జనాభాకు రూ.25 లక్షలు
10,000 పైబడి జనాభాకు రూ.50 లక్షలు వరకు
తిరుపతి జిల్లాలోని 777 గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పెంచిన ప్రోత్సాహకాలు వర్తించనున్నాయి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,