సీసీ రోడ్లు,ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన
పటాన్‌చెరు;వేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ముత్తంగి డివిజన్ కేంద్రంలోని మధురానగర్, గాయత్రి కాలనీలలో రూ.1.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు, ఘనపూర్ గ్రామంలో రూ.13 లక్షలతో చేపట్టనున్న వార్డు కార్యాలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని కాలనీలు, వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, కాశీరెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, రామకృష్ణ, డీఈ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.