BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే.

Select Suryaa Now
వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే.

**కంబదూరు:** ఎన్నికల అనంతరం రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని, కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం మేళ్లకుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ. రామాంజనేయులు, జీ. రామాంజనేయులుపై ఎన్నికల అనంతరం జరిగిన దాడి ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాళ్లనంతపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు చేతులకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా గ్రామానికి వెళ్లి బాధితులను కలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, దాడి జరిగిన తీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. గాయాలతో బాధపడుతున్న కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, ఎలాంటి ఆందోళన చెందవద్దని, పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియలో గెలుపోటములు సహజమని, ఓటమిని జీర్ణించుకోలేక ప్రత్యర్థులపై దాడులకు దిగడం సరైన రాజకీయ విధానం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనాల్సి ఉండగా, కొందరు వ్యక్తులు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని అన్నారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత దాడుల వరకు తీసుకెళ్లడం సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తల సంక్షేమానికి తమ ప్రభుత్వం, పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తాయని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులతో మాట్లాడి, దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, కంబదూరు మండలం మంద కుర్లపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సమతమ్మ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛంతో సత్కరించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమతమ్మకు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ఎన్నికల అనంతరం దాడిలో గాయపడిన కార్యకర్తలకు అండగా నిలుస్తూ, మరోవైపు నూతన ప్రజాప్రతినిధులను అభినందిస్తూ ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది. ఈ పర్యటనతో బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపడంతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి