BREAKING
సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు... ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనలలో మార్పులపై కసరత్తు బాలలే దేశ సంపద

విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

Select Suryaa Now
విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. CII సమ్మిట్‌లో భాగంగా జరిగిన ఒక చర్చా వేదికపై వీరిద్దరూ సినీ పరిశ్రమ భవిష్యత్తుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకురావడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ.. విశాఖపట్నానికి చిత్ర పరిశ్రమను తీసుకురావడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కేవలం షూటింగ్‌లకే పరిమితం కాకుండా, హైదరాబాద్ తరహాలో విశాఖలో కూడా పూర్తిస్థాయి 'ఫిల్మ్ ఎకో సిస్టమ్' (స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్, మౌలిక సదుపాయాలు) క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. మంత్రి ప్రతిపాదనపై రానా హర్షం వ్యక్తం చేస్తూ, ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖను సినీ కేంద్రంగా మార్చేందుకు ఇరువురి మధ్య జరిగిన ఈ చర్చ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.