బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని స్థానిక సంతపేట నాగాలమ్మ గుడి సమీపంలో గల బృందావన్ సెకండరీ స్కూల్ లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ శైలజ కుమారి , డైరెక్టర్లు ప్రియతేజ , హిమజ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి, బాలల ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలను నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, ప్రశంసా పత్రాలను అందించి ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టీ.వీ. సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు ఇతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.