కల్పన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడుఅనిల్ రెడ్డి
వర్గల్ . ; సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో వైద్యం వికటించి మృతి చెందిన పసుల కల్పన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిల్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి 10,000ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.కల్పన మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కుటుంబానికి జరిగిన నష్టం తీరనిదని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
అలాగే బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని, అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని అనిల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వర్గల్ మాజీ ఉపసర్పంచ్ రమేష్,యువజన కాంగ్రెస్ నాయకులు అయ్యగల్ల నందకుమార్,పిట్ల కృష్ణ,జనార్దన్,అబ్జాల్,యువజన కాంగ్రెస్ నాయకులు నితిన్ రెడ్డి,నవీన్ యాదవ్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.