BREAKING
సీఓపీ31 సదస్సులో క్లైమేట్ ఫైనాన్స్ డిమాండ్లు పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' మూవీ రివ్యూ సీసీ రోడ్లు,ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన రేపల్లె నుంచి దూర ప్రాంతాలకు రైలు సర్వీసులు ప్రారంభించాలి ప్రయాణికుల అవసరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి పట్టణ ఆదర్శ వేదిక కార్యదర్శి యడ్లపల్లి కిషోర్ బాబు విజ్ఞప్తి నేడుధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు రోబోటిక్ సర్జరీతో మెరుగైన వైద్య సేవలు.. తక్కువ కోతలతో వేగవంతమైన కోలుకోవడం! నార్వే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ "విజేతలకు అభినందనలు, యోధులకు జే జే లు - కాకాణి" పిల్లలు సొంతంగా సొంత దారులను వెతుక్కోవాలి.. సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు భిన్నత్వంలో ఏకత్వమే పటాన్‌చెరు ప్రత్యేకత మోపిదేవి చంద్రం మృతి పట్ల టీడీపీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్ సంతాపం వైయస్సార్ సీపీ నాయకుడు ఆదినారాయణ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంత వెంకటరామిరెడ్డి కల్పన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడుఅనిల్ రెడ్డి

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన్నబాబు

Select Suryaa Now
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు  మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన్నబాబు

బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ :  గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని, సమాజాభివృద్ధికి పునాదులని వాటిని సమాజానికి చేరువ చేయాలనే సంకల్పంతోనే గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమీషనర్ ఇనమల చిన్నబాబు పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘ శాఖా గ్రంథాలయంలో శుక్రవారం ఆయన 59 గ్రంథాలయ  వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమ నేతల స్మరణ, 17న కవి సమ్మేళనం, సెమినార్, 18న విద్యార్థులకు పలు రకాల పోటీలు 19న మహిళా దినోత్సవం, 20న బహుమతి ప్రధానోత్సవంతో ఈ వారోత్సవ కార్యక్రమం ముగుస్తుందన్నారు. విజ్ఞానానికి, విలువలకు, వివేకానికి, విచక్షణకు తోడ్పడే ఈ గ్రంథాలయ వారోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కమీషనర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ రత్న గండికోట సుధీర్ కుమార్, గ్రంథ పాలకులు అల్లాడి నరసింహారావు, సిఓ నర్మద, ఆర్ ఐ హనుమ ప్రకాష్ లు పాల్గొన్నారు