BREAKING
కార్తీకమాసం ఏర్పాట్లపై శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామస్వామి దేవస్థానంలో సమీక్ష ముడిసరుకుల సరఫరాలో అంతరాయాలు ద్రవిడ విధానంపై ప్రభావం చూపుతాయి ఉత్తరప్రదేశ్‌లో సంభల్ 24 కోసి పరిక్రమ ప్రారంభం విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో మల్టీ-లెవెల్ పార్కింగ్ ప్రారంభించిన ఎల్జీ సక్సేనా సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ! అవగాహన ఒప్పందాలను ప్రారంభోత్సవాలుగా మార్చాలి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలు జపాన్ మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన లక్ష్య సేన్ సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం 2027 నాటికి బ్యారెల్ 70 డాలర్లకు ముడి చమురు ధరలు విజయోత్సవ ర్యాలీకి కదలిన పసుపు దళం బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ ఆగ్నేయాసియాలో క్షయవ్యాధి నిర్మూలనకు బహుళ రంగాల సమన్వయ చర్యలు అవసరం

ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే, 20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే,  20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!*  *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 13 : ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే,  కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి మాత్రం ఉండాల్సిందే అని, గ్రామ పంచాయతీ  ఎన్నికల నిర్వహణ సందర్భంగా  ఎన్నికల సంఘం సూచించిన క్రింది 20 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్, మాజీ సైనికుల పెన్షన్ పుస్తకం, వృద్ధాప్య, వితంతు పెన్షన్ పత్రాలు, ఫొటోతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, APCOB, DCCBలు జారీ చేసిన ఫొటో పాస్‌బుక్‌లు, కిసాన్ పాస్‌బుక్‌లు, బ్యాంకులు జారీ చేసిన ఫొటోతో కూడిన ఏటీఎం కార్డులు, ఫొటోతో కూడిన రేషన్ కార్డులు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డులు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సులు, సంబంధిత అధికారి జారీ చేసిన ఫొటోతో కూడిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, బార్ కౌన్సిళ్లు జారీ చేసిన ఫొటోతో కూడిన సభ్యత్వ కార్డులు, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ, శాసనమండలి సచివాలయాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఎంపీలకు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.