BREAKING
ఉత్తరప్రదేశ్‌లో సంభల్ 24 కోసి పరిక్రమ ప్రారంభం విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో మల్టీ-లెవెల్ పార్కింగ్ ప్రారంభించిన ఎల్జీ సక్సేనా సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ! అవగాహన ఒప్పందాలను ప్రారంభోత్సవాలుగా మార్చాలి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలు జపాన్ మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన లక్ష్య సేన్ సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం 2027 నాటికి బ్యారెల్ 70 డాలర్లకు ముడి చమురు ధరలు విజయోత్సవ ర్యాలీకి కదలిన పసుపు దళం బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ ఆగ్నేయాసియాలో క్షయవ్యాధి నిర్మూలనకు బహుళ రంగాల సమన్వయ చర్యలు అవసరం ఢిల్లీలో కాలుష్యా నిరోధక ఆంక్షల అమలుపై ఇంటర్‌స్టేట్ పోలీసుల ఉన్నత స్థాయి సమీక్ష సిద్దిపేట కలెక్టరేట్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి..

Select Suryaa Now
మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి..

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-జేఎన్టీయూ అనంతపురం ఓటిపిఆర్ఐలో శుక్రవారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వికసిత్ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన 100 వారాల నషా ముక్త్ యువజన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఓటిపిఆర్ఐ సంచాలకులు ఆచార్య జి.వి. సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జేఎన్టీయూఏ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య డాక్టర్ జి. మమత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు వివిధ పోటీలు, అవగాహన చర్చలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు లహరి, కె. సుధాకర్, డిప్యూటీ రిజిస్ట్రార్ బి. దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ ఎం.డి. నాగభూషణం, విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నివారణకు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..