BREAKING
కలచట్ల వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా రజనీకాంత్‌రెడ్డి హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ పై అవగాహన కలిగించండి -జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ బండారుపల్లి శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి 1,00,000విరాళం శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యాలపై మంత్రి ఆనం ఆగ్రహం చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో సరికొత్త జన్యు చికిత్సను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన్నబాబు విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి -జడ్జి నిహారిక బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కార్తీకమాసం ఏర్పాట్లపై శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామస్వామి దేవస్థానంలో సమీక్ష ముడిసరుకుల సరఫరాలో అంతరాయాలు ద్రవిడ విధానంపై ప్రభావం చూపుతాయి ఉత్తరప్రదేశ్‌లో సంభల్ 24 కోసి పరిక్రమ ప్రారంభం విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు! **16న నోటిఫికేషన్.. 18 నుంచి 20 వరకు నామినేషన్లు.. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు**

Select Suryaa Now
రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు!  **16న నోటిఫికేషన్.. 18 నుంచి 20 వరకు నామినేషన్లు.. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు**

రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు!

**16న నోటిఫికేషన్.. 18 నుంచి 20 వరకు నామినేషన్లు.. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు**

**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**

మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండో విడతలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నాగ అనసూయ శుక్రవారం తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 22న అప్పీళ్ల స్వీకరణ, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణతో పాటు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందని వివరించారు. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.

**8 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ**

మండలంలోని గ్రామ పంచాయతీలను 8 క్లస్టర్లుగా విభజించి, ఆయా కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. కేంద్రాల వారీగా గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. **ఓర్వకల్లు:** ఓర్వకల్లు, కన్నమడకల, ఎన్.కొంతలపాడు, గుట్టపాడు.
2. **నన్నూరు:** నన్నూరు, మీదివేముల.
3. **పూడిచెర్ల:** పూడిచెర్ల, కేతవరం.
4. **లొద్దిపల్లె:** లొద్దిపల్లె, బొడ్డువానిపల్లె.
5. **ఉయ్యాలవాడ:** ఉప్పలపాడు, ఉయ్యాలవాడ.
6. **హుస్సేనాపురం:** హుస్సేనాపురం, కాల్వ, గుడుంబాయి తండా.
7. **శకునాల:** శకునాల, తిప్పాయపల్లి, బ్రాహ్మణపల్లి.
8. **సోమయాజులపల్లి:** సోమయాజులపల్లి, కొమరోలు, చింతలపల్లి, పాలకొలను.

అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీకి కేటాయించిన కేంద్రంలోనే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీవో నాగ అనసూయ సూచించారు.