BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

బండారుపల్లి శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి 1,00,000విరాళం

Select Suryaa Now
బండారుపల్లి శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి  1,00,000విరాళం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం, బండారుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో శివాలయ ముఖద్వార ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించిన ఆయన, ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా బండారుపల్లి గ్రామానికి విచ్చేశారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యుల 1,00,000లక్ష రూపాయల) నగదును ఆలయ నిర్మాణ నిమిత్తం అందజేశారు. అంతేకాకుండా, త్వరలో జరగబోయే శిలా ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసే భక్తులందరికీ  అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.  గ్రామానికి విచ్చేసిన  కంచి పరమేశ్వర రెడ్డి కి బండారుపల్లి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆత్మీయంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన నూతన శివాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీ సీతారాముల దేవస్థానంలో  పూజా కార్యక్రమాలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా, అన్నదానానికి ముందుకొచ్చిన కంచి పరమేశ్వర రెడ్డి ని గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.