BREAKING
శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యాలపై మంత్రి ఆనం ఆగ్రహం చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో సరికొత్త జన్యు చికిత్సను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన్నబాబు విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి -జడ్జి నిహారిక బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు బృందావన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కార్తీకమాసం ఏర్పాట్లపై శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామస్వామి దేవస్థానంలో సమీక్ష ముడిసరుకుల సరఫరాలో అంతరాయాలు ద్రవిడ విధానంపై ప్రభావం చూపుతాయి ఉత్తరప్రదేశ్‌లో సంభల్ 24 కోసి పరిక్రమ ప్రారంభం విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో మల్టీ-లెవెల్ పార్కింగ్ ప్రారంభించిన ఎల్జీ సక్సేనా సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ!

నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

Select Suryaa Now
నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

విజయవాడ, మేజర్ న్యూస్: బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినా, అధిక ధరలు వసూలు చేసినా, తూనికల్లో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ హెచ్చరించారు.

బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకు అన్ని రైతుబజార్లలో సబ్సిడీ బియ్యం కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మార్కెట్లో కిలో ఉల్లి రూ.65 ఉండగా, రైతుబజార్లలో రూ.35కే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రైవేటు రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని స్పష్టం చేశారు. బీపీటీ సోనా, సాంట రకం కిలో రూ.66, ఐఐఎంటీ, ఆర్ఎన్ఆర్ రకం రూ.76, స్వర్ణ మసూరి రూ.47, జై శ్రీరామ్ రకం రూ.82 చొప్పున విక్రయించాలన్నారు. నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, ఆహార భద్రత, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని, గత వారం రోజుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 36 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. వ్యాపారులంతా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వినియోగదారులకు కనిపించేలా ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు.

బియ్యం, ఇతర నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కంట్రోల్ ఆర్డర్‌ను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని జాయింట్ కలెక్టర్ వివరించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.