జేఎన్‌టీయూఏలో పారిశ్రామిక పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి..
అనంతపురం విద్య, మేజర్ న్యూస్:-జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక రంగానికి చెందిన ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల అధికారులు, పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల కోసం పార్ట్‌టైమ్, పూర్తిస్థాయి పరిశోధనా పట్టాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఏ. సురేష్‌బాబు తెలిపారు. ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు సూచనల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు.
సివిల్, విద్యుత్, యాంత్రిక, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, రసాయన, ఔషధ శాస్త్ర విభాగాల్లో పరిశోధనకు అవకాశం కల్పించనున్నారు. మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ సాధించి ఉండాలి. విశ్వవిద్యాలయం తరఫున పరిశోధన మార్గదర్శిని నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు రూ.5 వేల డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి ఈ నెల 22వ తేదీలోగా ప్రవేశాల సంచాలకులకు దరఖాస్తులు చేరేలా పంపాలి. జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి పూర్తిస్థాయి పరిశోధన పట్టాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్