పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గౌతమ్ జూలకంటి
దుర్గి మండల కేంద్రంలో షేక్ సైద్ జాన్ కుమార్తె చిరంజీవి ఆసియా పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్ జూలకంటి హాజరై చిన్నారి ఆసియాను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.
పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి