BREAKING
విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో మల్టీ-లెవెల్ పార్కింగ్ ప్రారంభించిన ఎల్జీ సక్సేనా సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ! అవగాహన ఒప్పందాలను ప్రారంభోత్సవాలుగా మార్చాలి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలు జపాన్ మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన లక్ష్య సేన్ సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం 2027 నాటికి బ్యారెల్ 70 డాలర్లకు ముడి చమురు ధరలు విజయోత్సవ ర్యాలీకి కదలిన పసుపు దళం బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ ఆగ్నేయాసియాలో క్షయవ్యాధి నిర్మూలనకు బహుళ రంగాల సమన్వయ చర్యలు అవసరం ఢిల్లీలో కాలుష్యా నిరోధక ఆంక్షల అమలుపై ఇంటర్‌స్టేట్ పోలీసుల ఉన్నత స్థాయి సమీక్ష సిద్దిపేట కలెక్టరేట్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మురసు తుపాను బీభత్సాన్ని కేంద్ర బృందానికి వివరించిన ఎమ్మెల్యే ఏలూరి

జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కీలకం

Select Suryaa Now
జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కీలకం

విజయవాడ, మేజర్ న్యూస్: రాబోయే జనగణన (సెన్సస్) రెండవ దశ జనాభా గణన ప్రక్రియ అత్యంత కీలకమైనదని, చార్జ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పూర్తి అవగాహనతో, సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను https ://sc.census.gov.in నందు జనవరి 10,2027 నుండి జనవరి 24,2027 వరకు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో పాల్గొనేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జనగణన రెండవ దశ (పాపులేషన్ ఎన్యూమరేషన్)పై జిల్లా, చార్జ్ స్థాయి అధికారులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ, జనాభా గణనలో భాగంగా మొత్తం 40 ప్రశ్నలతో కూడిన వివరాలను మొబైల్ యాప్ ద్వారా సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియను చివరి నిమిషంలో హడావుడి లేకుండా ముందస్తు ప్రణాళికతో 55 రోజుల వ్యవధిలో, ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 647 బ్లాక్‌ల వారీగా ఎన్యూమరేటర్లకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి, సమాచారాన్ని కచ్చితత్వంతో నమోదు చేసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియ అని, ఎన్నికల విధుల తరహాలోనే దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లకు మొబైల్ యాప్ వినియోగం, బ్లాక్‌ల సరిహద్దుల సవరణ, సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంపై ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం మండల స్థాయిలో ఫీల్డ్ ట్రైనర్లు, ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ, జనగణన రెండవ దశ షెడ్యూల్‌ను వివరించారు. జనవరి 10 నుంచి 24 వరకు 15 రోజుల పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు 35 రోజుల పాటు ఇంటింటి జనాభా గణన, అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు రివిజన్ రౌండ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర జనగణన కార్యకలాపాల శాఖ జాయింట్ డైరెక్టర్ / సీఈఓ జి.ప్రసన్నకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెండవ దశ జనగణనలో ఎదురయ్యే సాంకేతిక అంశాలు, మొబైల్ యాప్ పనితీరు, బ్లాక్‌ల విభజన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని, కన్వర్షన్ రేటును పెంచేందుకు అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో విజయవాడ ఆర్డిఓ వెన్నెల శ్రీను, తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఎ.రవీంద్రరావు మాస్టర్ ట్రైనర్ కొల్లేటి రమేష్, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సెన్సస్ ఇన్‌స్ట్రక్టర్లు సిహెచ్. వెంకటరమణ, వి.ఆదిలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, చార్జ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.