డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
*డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక
కర్నూలు, నవంబర్ 13: కర్నూలు నగర మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాల్టీలు, గూడూరు నగర పంచాయతీ లలో వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు...
ఈ నెల 23వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికల నిర్వహణ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23 వ తేదీన జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జరగనున్న డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు. డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన వివరణాత్మక సర్క్యులర్ మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమావేశానికి మూడు రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలని, సమావేశం ప్రారంభంలో తొలుత మేయర్/చైర్మన్‌తో ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం మిగిలిన ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తరువాత డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలన్నారు...ప్రత్యేక సమావేశానికి కోరం ఉండాలని, ఎక్స్-అఫీషియో సభ్యుల ఓటు హక్కు వినియోగంపై సంబంధిత నిబంధనలను అధికారులు స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్లుగా సీటింగ్ ఏర్పాటు చేసి, ఆయా పార్టీల పేర్లతో స్టిక్కరింగ్ చేయడం ద్వారా సభ్యులను సులభంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు...
ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, ఓత్ టేకింగ్, కోరం, నామినేషన్ ఫారాలు, పార్టీ విప్ జారీ తదితర అంశాల గురించి కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, గూడూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.