ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు
ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి!
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఈ నెల 19న నిర్వహించనున్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సతీష్ కుమార్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు పంపించారు.
అలాగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు ప్రిసైడింగ్ అధికారి సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి నాగ అనసూయ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.