BREAKING
టైక్వాండో పోటీల్లో టౌన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ* పది దపాలు ఏకగ్రీవం - మూడు దపాలు లు నామమాత్ర పోటీ పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి -జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్* ప్రజా సమస్యల పరిష్కారం,పట్టణ అభివృద్ధే లక్ష్యం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : అపరిస్కృతంగా ఉన్న డ్రైనేజీ పనులకు మోక్షం ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలురాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 131 కంప్యూటర్ల గోల్‌మాల్‌పై విచారణ జరపాలి: బీటీఎఫ్* పొదిలి మున్సిపాలిటీ లో కూటమి జయకేతనం ఎగురవేయాలి -మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆరోగ్య రక్షకులు పారిశుద్ధ్య కార్మికులు వారి కష్ట ఫలితమే మన ఆరోగ్యం కలచట్ల వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా రజనీకాంత్‌రెడ్డి హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ పై అవగాహన కలిగించండి -జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ బండారుపల్లి శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి 1,00,000విరాళం శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యాలపై మంత్రి ఆనం ఆగ్రహం చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో సరికొత్త జన్యు చికిత్సను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

మైనార్లు వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు : మదనపల్లి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా హెచ్చరికలు

Select Suryaa Now
మైనార్లు వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు : మదనపల్లి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా హెచ్చరికలు

మదనపల్లి,మేజర్ న్యూస్ : కర్నూలు రేంజ్ డీఐజీ సూచనల మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా వారి సిబ్బంది కలసి వాహనదారులతో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు,నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా మదనపల్లి పట్టణం నందు ముఖ్యంగా మైనర్ పిల్లలు పాఠశాలలు,కళాశాలకు ద్విచక్ర వాహనాలు నడుపుకుంటూ వెళ్తున్న విద్యార్థుల వాహనాలను ఆపడంతోపాటు పరిమితికి మించి ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలను కూడా ఆపి,వారికి ప్రమాదాలను వివరిస్తూ మైనర్ పిల్లలను,ఆటో డ్రైవర్లని హెచ్చరించారు.ముఖ్యంగా మైనర్ విద్యార్థులు  వాహనాలను నడపడం నేరమని,మీరూ తెలియక వాహనాలను నడుపుతున్నారు కావున,ఇక మీదట మీరు వాహనము నడుపుకుంటూ పాఠశాల,కళాశాలకి   పోయిన యెడల మీ తల్లిదండ్రులను మదనపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి,కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు.ఇకమీదట ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే,ఆ వాహనాలను వన్ టౌన్ లేదా టూ టౌన్ మదనపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లకు మైనర్ వాహనాలను అప్పగించి,జరిమానాలు విధించడంతోపాటు మైనర్లపై కేసులను నమోదు చేయడమే కాకుండా చట్టప్రకారం కోర్టు నందు హాజరు పరుస్తామని హెచ్చరించారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి