BREAKING
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత బాలల ఆరోగ్యానికి పోషకాహార తోటలు ఎంతో దోహదం బాలల భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం

14ఏళ్లయినా పూర్తిగాని భవన నిర్మాణం - మోక్షం ఎప్పటికంటున్న జనాలు

Select Suryaa Now
14ఏళ్లయినా పూర్తిగాని భవన నిర్మాణం - మోక్షం ఎప్పటికంటున్న జనాలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్:   ఆత్మకూరులో అనేక భవనాలు నిర్మాణంలో అర్ధాంతరంగా నిలిచిపోవడం, నత్తనడకన సాగడం, వాటి గురించి ఎవరు పట్టించుకోనక పోతుండడం పరిపాటిగా ఉండగా అత్యంత ప్రాధాన్యత కలిగిన మండల రెవెన్యూ కార్యాలయ భవనం దశాబ్దం దాటిన నిర్మాణం పూర్తి కాకుండా దర్శనమిస్తుండటం గమనార్హం.వర్షాల సమయంలో సిబ్బందిలో ఆందోళనలు కనిపిస్తుంది. నూతన భవనాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సంవత్సరాల క్రితం శంకుస్థాపన గావించబడి పనులు ప్రారంభమై స్లాబ్ లెవల్ కు చేరగా ఈనాటికి పూర్తిగా కాకుండా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం తాసిల్దార్ కార్యాలయం కొనసాగుతున్న బ్రిటిష్ కాలం నాటి భవనం శిథిలావస్థకు చేరుకోగా వర్షాలకు అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతుండడం తో పాటు రికార్డులు తడిచిపోతాయని ఆందోళన వారిలో కనిపిస్తుంటుంది. భవనపైకప్పు తార్పాలిన్ పట్టలు కప్పుకొని కాలం వెళ్ళబుచ్చుతున్నారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాత్యులు, ఆత్మకూరు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి దాదాపు 2500 కోట్ల రూపాయలు నిధులు సాధించి అనేక రోడ్లు, భవనాలు, సంస్థలు, వంతెనలు తదితరాలను సాధించారు.అందులో భాగంగా ఆత్మకూరు మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో  తాసిల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, ట్రెజరీ భవనాల నిర్మాణాలకు అప్పట్లో మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అప్పటి రెవిన్యూ మంత్రి యన్ రఘువీరారెడ్డిని రప్పించి శంకుస్థాపన గావించారు. కాగా ట్రెజరీ కార్యాలయం తమ శాఖ నిధులు సాధించుకుని భవనం నిర్మించుకొని శిథిలమైన భవనం నుండి నూతన భవనంలోకి మారారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం భవనం నిర్మాణం నిలిచిపోయి ఉండగా మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ చొరవ తీసుకొని పనులు పూర్తి చేయించి ప్రారంభోత్సవ గావించి ఆర్డీవో కార్యాలయాన్ని నూతన భవనంలోకి తరలించారు. ఇక తాసిల్దార్ కార్యాలయ భవనం మాత్రం అలాగే స్లాబ్లెవల్లో దర్శనమిస్తోంది. అయితే  ఈ దపా ఆత్మకూరు శాసనసభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతుండడం తో ఆయన ఈ భవనాన్ని పరిశీలించి తాను ఆనాడు మంజూరు చేయించిన భవనం ఇంకా పూర్తి కాకపోవడం బాధాకరమని పేర్కొంటూ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇంకా సంబంధించిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. మంత్రి చొరవ తీసుకొని ఈ భవన నిర్మాణం పూర్తి చేయించి శిధిల భవనంలో ఉన్న అధికారుల,సిబ్బంది అవవస్థలు తొలగించాలని సర్వత్ర కోరుతున్నారు.