పది దపాలు ఏకగ్రీవం - మూడు దపాలు లు నామమాత్ర పోటీ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కంచర్ల శ్రీహరి నాయుడు స్వగ్రామం ఆత్మకూరు మండలం నారంపేట పంచాయతీగా ఏర్పడిన నాటినుండి నేటి వరకు గ్రామస్తుల ప్రజాదరణతో ఒకే కుటుంబ పాలన సాగుతోంది. పంచాయతీ ఏర్పడిన నాటి నుండి 13 దపాలకు గాను మూడు దపాలు మాత్రమే నామ మాత్రం పోటీ కాగా మిగతా పది దపాలు ఒకే కుటుంబంకు చెందినవారు విజయం సాధించి పాలన సాగించారు. రిజర్వేషన్ ఉన్న సమయంలో మాత్రం కంచర్ల అనుచరులే సర్పంచులు కాగా వారే పాలన కొనసాగించారు.ఈ దపా పంచాయతి సర్పంచ్ పదవి ఎస్ సి మహిళకు రెసర్వేషన్ అయింది. కంచర్ల ఆధ్వర్యంలో ఎవరిని వరించునుందో చూడాల్సి ఉంది.కంచర్ల శ్రీహరి నాయుడు భూస్థితిమంతులుగా ఆయన శాసనసభ్యుడుగా ఉన్నాహయాంలో సీలింగ్ భూములు ప్రభుత్వ స్వాదినం చేయడంతో పాటు శ్రీహరి నాయుడు ఉదాత్తమైన స్వభావంతో కొండంత మనసు చేసుకొని తమ 170 ఎకరాల భూమిని పేద ఎస్సీలకు పంపిణీ చేసి పేరు ప్రఖ్యాతలు గడించారు. శ్రీహరి నాయుడు గతంలో మూడు దఫాలు గ్రామ సర్పంచ్ గా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా,నాలుగేళ్లపాటు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. నారంపేట గ్రామపంచాయతీ ఏర్పడ్డాక 1959, 1964, 1970లో ఏకగ్రీవంగా కంచర్ల శ్రీహరి నాయుడు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1972లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేయగా కంచర్ల చిన్నపాప నాయుడు సర్పంచ్ గా వ్యవహరించారు. 1981 లో పంచాయతీ రిజర్వు కాగా గంధం రామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్ గా కంచర్ల ఆధ్వర్యంలో ఎన్నికయ్యారు. 1988లో శ్రీహరి నాయుడు కుమారుడు కంచర్ల రమణ ప్రసాద్ ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయనకు బ్యాంకు ఉద్యోగం రావడంతో 1989లో కంచర్ల ఆధ్వర్యంలో జ్యోతి శ్రీరాములను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నిక చేయించారు. 1995లో ఎస్సీ రిజర్వు కాగా నీలం చెంచమ్మ ని ఎంపిక చేయించారు.2001లో శ్రీహరి నాయుడు కుటుంబ సభ్యులైన డాక్టర్ సిహెచ్ సుబ్బారావును, 2006లో డాక్టర్ సతీమణి చలిచీమల వెంకటసుబ్బమ్మ ను ఏకగ్రీవంగా సర్పంచ్లుగా ఎన్నిక చేయించారు. అప్పటివరకు ఆదర్శ గ్రామంగా ఉన్న నారంపేట పంచాయతీలో 2013లో ఎం సుబ్బయ్య అనే వ్యక్తి నామినేషన్ వేసి ఏకగ్రీవానికి అడ్డుకట్ట వేయగా ఆయనకు ఎన్నికల్లో కేవలం 13 ఓట్లు మాత్రమే లభించగా శ్రీహరి నాయుడు కోడలు కంచర్ల మాధవి అఖండ మెజారిటీతో విజయం సాధించి ఐదేళ్లు సర్పంచ్ గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కూడా మాధవి నామినేషన్ వేసి నామ మాత్రం పోటీ జరగగా ఆమె ఘన విజయం సాధించారు. అనాదిగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన కుటుంబంలోని మాధవి గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి వైకాపా మద్దతుతో సునాయాసంగా విజయం సాధించారు. అనంతరం ఆమె తెలుగుదేశం లో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టుగా నియమితులై లై కొనసాగుతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో కంచర్ల మాధవి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని పొందారు. కాగా పంచాయతీ ఎన్నికలు రావడంతో సర్పంచ్ పదవి ఎస్ సి మహిళకు రిజర్వేషన్ అయినందున కంచర్ల ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుచరులు సర్పంచ్ గా ఉండే అవకాశం మెండుగా ఉందని సర్వత్రా భావిస్తున్నారు.