BREAKING
ప్రజలకు అండగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారు లబ్ధిదారులకు ఎల్ ఓ సి పత్రాల అందజేత యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

Select Suryaa Now
ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు పట్టణంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా పండుగ వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోనూ నాగార్పమ్మ శిల వద్ద ,చెరువుగట్టు నాగవరపమ్మ దేవాలయం వద్ద, నాగేంద్ర పురం ప్రాంతంలో ఉన్న నాగశిల వద్ద నాగదేవత విగ్రహాలు, పుట్టల వద్ద ప్రత్యేక అలంకరణలు చేపట్టి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు  ఉపవాస దీక్షను ఆచరిస్తూ తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు చేసి, భక్తిశ్రద్ధలతో నాగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పుట్టలో పాలు పోసి, పుట్టకు నాగబంధం దారాన్ని చుట్టి నాగదేవతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నాగదేవత అనుగ్రహంతో కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు ప్రత్యేకంగా ప్రార్థించారు. పట్టణవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనడంతో నాగుల చవితి వేడుకలు భక్తిపారవశ్యంతో సాగాయి.జె ఆర్ పేటలోని నాగార్పమ్మ శిల వద్ద మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.