ప్రజా సమస్యల పరిష్కారం,పట్టణ అభివృద్ధే లక్ష్యం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : అపరిస్కృతంగా ఉన్న డ్రైనేజీ పనులకు మోక్షం
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించిన కొద్దిరోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ,ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులపై వేగంగా స్పందిస్తున్నారు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు.సమస్య ఏదైనా తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.గత రెండు నెలలుగా ప్రారంభానికి నోచుకోని డ్రైనేజీ పనుల సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా గత మూడు రోజులుగా నిరంతరం ప్రయత్నాలు చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు.సమస్యను వివరించిన వెంటనే స్పందించి,ఆలస్యం చేయకుండా అధికారులను అప్రమత్తం చేసి డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టించడం ఆయన పనితీరుకి నిదర్శనం.అదేవిధంగా మదనపల్లె మిషన్ కాంపౌండ్‌లో బోరు పనిచేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు,ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా బోరును మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.దీంతో అధికారులు వెంటనే మరమ్మతు పనులకు సిద్ధమయ్యారు.పదవి అలంకారం కోసం కాదు,ప్రజలకు సేవ చేయడం కోసమే అన్నట్లుగా ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ,విజ్ఞప్తి అందిన వెంటనే స్పందించి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న ఆయన పనితీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది.మదనపల్లె పట్టణ అభివృద్ధికి కూటమి ద్వయం సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోంది.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి