BREAKING
ప్రజలకు అండగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారు లబ్ధిదారులకు ఎల్ ఓ సి పత్రాల అందజేత యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

ఆరోగ్య రక్షకులు పారిశుద్ధ్య కార్మికులు వారి కష్ట ఫలితమే మన ఆరోగ్యం

Select Suryaa Now
ఆరోగ్య రక్షకులు పారిశుద్ధ్య కార్మికులు  వారి కష్ట ఫలితమే మన ఆరోగ్యం

వింజమూరు, మేజర్ న్యూస్  :  తెల్లవారక ముందే ఊరు నిద్ర లేవక ముందే లేచేవారు ఊరు నిద్రపోయాక కూడా పనిచేసేవారు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు వారి కష్టం వల్లే నేడు మనం ఆరోగ్యంగా పరిశుభ్రంగా బతుకుతున్నాం ఉదయం ఐదు గంటలకే చీపురు పట్టుకుని రోడ్లమీదకు వచ్చే ఈ కార్మికులు మురికి కాలువలు చెత్తకుప్పలు డ్రైనేజీలు శుభ్రం చేస్తారు ఎండ వాన చలి అని చూడకుండా పండుగ ఆదివారం అని లేకుండా ప్రతిరోజు విధులు నిర్వర్తిస్తారు వారు ఒక్కరోజు పనికి రాకపోతే ఊరంతా దుర్వాసనతో నిండిపోతుంది దోమలు ఈగలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి రోగాలు వ్యాపిస్తాయి అంటే  కేవలం చెత్తబట్టేవారు కాదు రోగాలను ఊరి పొలిమేర దాటకుండా ఆపే ఆరోగ్య రక్షకులుగా నిలుస్తున్నారు అందులో భాగంగానే వింజమూరు పట్టణంలోని శ్రీ వివేకానంద కళాశాల సమీపంలో ఉన్న డ్రైనేజీ మరమ్మతుల గురి కావడంతో దానిని ఎలాంటి బ్లౌజులు కానీ మాస్కులు గాని లేకుండా అందులో దిగి మూడు రోజులుగా కృషిచేసి ఎంతో కష్టం మీద ఆ పైపులు లాగి నీరు పోయే విధంగా కష్టపడి పని చేశారు వారు ఆ డ్రైనేజీ లోని విషపూరితమైన వ్యర్థాలను ఎత్తు వేస్తూ మనకు పరిశుభ్రతను కలిగిస్తున్నారు. వారు చేస్తున్న ఆ పనిని చూసి ఆశ్చర్యపోయేటువంటి ప్రజలు ఉన్నారు చూస్తూ వారు చేసేటువంటి కష్టానికి చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు తక్కువ జీతం సరైన వైద్య సదుపాయం లేకపోవడం ఉద్యోగ భద్రత లేకపోవడం వారి నిత్య సమస్యలు పంచాయితీ కార్మికులు నిజమైన దేవతలు గుడిలో దేవునికి పూజ చేస్తాము కానీ కళ్ళ ముందు కనిపించే నిజమైన దేవతలు ఈ దేవతలను గౌరవించడం మర్చి పోతున్నాము 
చేయాల్సిన పని 
చెత్తను రోడ్డు మీద కాకుండా డబ్బాలలో వేయడం కార్మికులను అన్నా అక్క అని గౌరవంగా పిలవడం వారికి త్రాగునీరు మాస్కో గ్లౌజులు ఇచ్చి సహాయం చేయడం లాంటి పనులు చేసినట్లయితే వారికి మనం మనల్ని గౌరవించుకున్నట్లు అవుతుంది పారిశుద్ధ్య కార్మికుడు నవ్వితే ఊరు నవ్వుతుంది వారిని గౌరవిద్దాం వారి ఆరోగ్యాన్ని కాపాడుదాం అని ప్రతి ఒక్కడు భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ కార్మికుడే లేనట్లయితే మన ఆరోగ్యం లోటున పడే అవకాశం ఉంటుంది గనక అలాంటి వారిని ఆరోగ్య రక్షకులుగా భావించి వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది