పొదిలి మున్సిపాలిటీ లో కూటమి జయకేతనం ఎగురవేయాలి -మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి
సూర్య స్టేట్ బ్యూరో.
పొదిలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిగారు పొదిలి పట్టణంలోని పొదిలి పట్టణ కూటమి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం జిల్లా పరిశీలకులు మరియు ఎమ్మెల్సీ బీటి నాయుడు విచ్చేసి నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మల్కాపురం నియోజకవర్గంలోని నాలుగు జడ్పిటిసి లకు నాలుగు జడ్పిటిసిలు 49 ఎంపీటీసీలుగాను 41 ఎంపీటీసీలు గెలుపొంది చరిత్ర సృష్టించామని అన్నారు. ఇదే వరవడిని వచ్చే పొదిలి మున్సిపల్ ఎన్నికల్లో చూపించాలని కూటమి 28 వార్డుల్లో విజయం సాధించాలని దానికి కాను ప్రతి వార్డ్ నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.