నవంబర్ 15న వెలుగులో మూర్ఛ వ్యాధి వైద్యశిబిరం : సంస్థ కార్యదర్శి యం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : పేద,మధ్యతరగతి మూర్ఛ వ్యాధి బాధితులకు వైద్య సహాయం అందించేందుకు జీబీఅర్ ఫౌండేషన్,బాపట్ల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం మూర్ఛ వ్యాధి వైద్య శిబిరం మదనపల్లి పట్టణం,అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు సంస్థలో నిర్వహిస్తున్నట్లు
వెలుగు సంస్థ కార్యదర్శి యం.ఉదయ్ మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగు సంస్థ ఆధ్వర్యంలో జరిగే వైద్య శిబిరంలో డాక్టర్ గోపాళం శివన్నారాయణ వైద్య సేవలు అందించనున్నారని స్పష్టం చేశారు.2001 జూన్ నుంచి జీబీఅర్ ఫౌండేషన్ పేద రోగుల కోసం ఈ శిబిరాలను నిర్వహిస్తోందని,ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 శిబిరాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు వివరించారు.ప్రతి రెండు నెలలకు ఒకసారి మదనపల్లెలోని వెలుగు ప్రత్యేక పాఠశాలలో ఈ శిబిరం నిర్వహించి,రోగులకు రెండు నెలలకు సరిపడా మందులు అందజేస్తున్నారని వివరించారు.మదనపల్లె పట్టణం వెలుగు ప్రత్యేక పాఠశాల,అమ్మచెరువు మిట్ట,కదిరి రోడ్డు,గంగమ్మ గుడి సమీపంలో ఈ నెల 15వ తేది ఆదివారం
ఉదయం 10 గంటలకు నుండి ప్రారంభమైయ్యే
వైద్యశిబిరాన్ని మూర్ఛ రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిబిరానికి వచ్చే రోగులు తమ పాత వైద్య రిపోర్టులు,ప్రస్తుతం వాడుతున్న మందులు,వాటి అట్టలు తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.మరిన్ని వివరాలకు 9440585285,7799225444 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి