గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి
59వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి
- ఉమ్మడి అనంత జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్
- అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : నేటి నుండి అనంతపురం జిల్లాలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంధాలయం లోని తన చాంబర్ లో.. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ శివ కుమార్, డిప్యూటీ గ్రంథాలయ అధికారి కమ్మన్న తోకలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వడ్డే వెంకట్ మాట్లాడుతూ 59 వ జాతీయ స్థాయి గ్రంధాలయ వారోత్సవాలను.. జిల్లాస్థాయిలో.. జిల్లా కేంద్ర గ్రంధాలయంలో.. బాలల దినోత్సవం రోజు ఈనెల 14 న ప్రారంభించి.. ఈనెల 20 వరకు ఆరు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం, 15 గ్రంథాలయాల్లో పుస్తక ప్రదర్శన, పుస్తక పట్టణ ప్రాముఖ్యత వివరించడం జరుగుతుందని, 16 న గ్రంధాలయాల ప్రాముఖ్యత, వివిధ అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు. 17న కవి సమ్మేళనాలు, సెమినార్ లు, రచయితల సందేశాలు, 18న పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వకృత్వ, క్విజ్, ఆటల పోటీలు, 19న మహిళా దినోత్సవం, 20 న అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని.. గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముగింపు వారోత్సవాలకు జిల్లాకు చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. చిత్రలేఖనం, క్విజ్, ఆటల పోటీల్లో విజేతలకు.. ప్రోత్సహిక బహుమతులను అందించేందుకు.. ఎవరైనా ముందుకొస్తే.. ఆహ్వానిస్తామని.. ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వివిధ మండలాల గ్రంధాలయ అధికారులు పాల్గొన్నారు.