BREAKING
తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. చాందిని మసీద్ లో ముస్లిం, మైనార్టీలతో కలయిక.. దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు పని దినాల్లోనే సర్పంచ్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.. డి ఆర్ ఓ కు ఫ్యాప్టో జిల్లా నాయకుల వినతి మైనార్లు వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు : మదనపల్లి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా హెచ్చరికలు నవంబర్ 15న వెలుగులో మూర్ఛ వ్యాధి వైద్యశిబిరం : సంస్థ కార్యదర్శి యం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గౌతమ్ జూలకంటి *"చెయ్యెత్తండి - బస్సెక్కండి" నినాదం తుంగలో తొక్కిన ఆర్టీసీ!* *ఉచిత బస్సు పథకం అమలులో పిడుగురాళ్ల డిపో నిర్లక్ష్యం - ప్రయాణికుల అవస్థలు* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే, పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో మాత్రం ఆ పథకం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీస *షాద్‌నగర్‌లో రేపు పలు కాలనీల్లో 4 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేత... రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు! **16న నోటిఫికేషన్.. 18 నుంచి 20 వరకు నామినేషన్లు.. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు** ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు

Select Suryaa Now
రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు

కురబలకోట,మేజర్ న్యూస్ : ఏపీ ప్రభుత్వం,ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆదేశాల మేరకు 14వ తేదీ (శనివారం) నుండి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కురబలకోట శాఖ గ్రంధాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్షర సమాజం పుట్టిన నాటి నుండి గ్రంథాలు జీవన వికాసానికి,సామాజిక పురోగతికి సోపానాలుగా మానవ పరిణామాన్ని ఆవిష్కరిస్తుంటే,గ్రంథాలయాలు ఆ లక్ష్యాలను మరింతగా విస్తరిస్తూ వివేకవంతమైన తరాన్ని రూపొందించటంలో నిర్విరామ కృషిని కొనసాగిస్తున్నాయన్నారు.గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం,నేటి తరాలను గ్రంథాలయాలకు సన్నిహితం చేయడమే ధ్యేయంగా పౌరగ్రంథాలయ శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు.ఈ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14న వారోత్సవాల ప్రారంభ వేడుకలు (బాలల దినోత్సవం),15న పుస్తక ప్రదర్శన ఏర్పాటు,పుస్తక పఠన ప్రాముఖ్యత,16న గ్రంధాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్,పాతూరి నాగభూషణం,ఐ.ఎన్.జి వెంకటరమణయ్య తదితర ప్రముఖులను స్మరించుకోవడం,17న కవిసమ్మేళనాలు,సెమినార్లు,రచయితల సందేశాలు,18న పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు చిత్రలేఖనం,వ్యాసరచన,వక్తృత్వ,క్విజ్,క్రీడా పోటీలు నిర్వహణ,19న మహిళా దినోత్సవం,20వ తేదీ (శుక్రవారం) జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కావున ఈ గ్రంథాలయ వారోత్సవాలకు పాఠకులు,విద్యార్థిని,విద్యార్థులు,పురప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి