BREAKING
నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు నేటి బాలలే.. రేపటి భావి పౌరులు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..పథకం విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. హైమావతి

తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. చాందిని మసీద్ లో ముస్లిం, మైనార్టీలతో కలయిక.. దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్

Select Suryaa Now
తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..   చాందిని  మసీద్ లో ముస్లిం, మైనార్టీలతో కలయిక..  దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నగరంలోని మూడవ రోడ్డులో ఉన్న చాందిని మసీదులో ముస్లిం, మైనార్టీలతో కలిసి మేయర్ రమేష్ గౌడ్ దువా చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలను అలింగనం చేసుకుని వారిని అభినందించారు. ఎన్నికల్లో వారు చేసిన సహకారానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే గెలుపు సాధ్యమైందని మేయర్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని సంఘాల వారు పార్టీకి అందించిన మద్దతును గుర్తుంచుకుంటానని తెలియజేశారు. భవిష్యత్తులో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని, నగర అభివృద్ధికి అందరి సహకారం అవసరమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, మాజీ కార్పొరేటర్లు ఇషాక్, అశోక్ రెడ్డి, ముస్లిం, మైనార్టీలు హిద్దు, షకీల్, సవిద్, జిలాన్, ఫయాజ్, ఆరిఫ్, కరీం, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..