BREAKING
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు నేటి బాలలే.. రేపటి భావి పౌరులు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..పథకం విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఘనంగా నాగుల చవితి వేడుకలు సరస్వతి పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ కార్యక్రమాలు

తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు

Select Suryaa Now
తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు

పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన శ్రీనివాసులు, దేవిశ్రీ దంపతులు తీర్థయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన శ్రీనివాసులు, దేవిశ్రీలు ఒడిశా రాష్ట్రంలోని బైతరణి నదిలో స్నానం చేస్తుండగా, వారి మనవరాలు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని గమనించారు. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో వారిద్దరూ నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మేలుమాయి క్రాస్‌కు చేరుకున్నారు. మృతుల భౌతికకాయాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతుల కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి జరిగిన తీరని నష్టంపై విచారం వ్యక్తం చేసి  ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, వేణు, శ్రీనివాసులు, రాకేష్, సెల్వ తదితరులు పాల్గొన్నారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి