BREAKING
నవంబర్ 15న వెలుగులో మూర్ఛ వ్యాధి వైద్యశిబిరం : సంస్థ కార్యదర్శి యం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గౌతమ్ జూలకంటి *"చెయ్యెత్తండి - బస్సెక్కండి" నినాదం తుంగలో తొక్కిన ఆర్టీసీ!* *ఉచిత బస్సు పథకం అమలులో పిడుగురాళ్ల డిపో నిర్లక్ష్యం - ప్రయాణికుల అవస్థలు* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే, పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో మాత్రం ఆ పథకం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీస *షాద్‌నగర్‌లో రేపు పలు కాలనీల్లో 4 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేత... రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు! **16న నోటిఫికేషన్.. 18 నుంచి 20 వరకు నామినేషన్లు.. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు** ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు శిక్షణ నగర సంకీర్తనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే, 20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కీలకం ఘనంగా నాగుల చవితి

భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం.

Select Suryaa Now
భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం.

సూర్య స్టేట్ బ్యూరో.

విశాఖపట్నం: భవిష్యత్ అంతా టూరిజం రంగానిదే అని, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇన్వెస్టర్లను "ఫ్రెండ్స్" అని ఆత్మీయంగా సంబోధిస్తూ, "పెట్టుబడులు పెట్టండి.. వాటి రక్షణ, ప్రోత్సాహకాల బాధ్యత మాది" అని భరోసా ఇచ్చారు..ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టే ఈ మహా యజ్ఞంలో ఇన్వెస్టర్లందరూ భాగస్వాములు కావాలని, ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాక ఇతర ప్రాంతాల్లో టూరిస్టులకు కేవలం అనుభవాలు, జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయని, కానీ ఏపీలో అదనంగా ప్రజల ఆప్యాయత, గౌరవం లభిస్తాయని పేర్కొనడంతో ఇన్వెస్టర్లు హర్షించారు.. భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యమని మంత్రి దుర్గేష్ అందంగా చెప్పడం పలువురిని ఆకట్టుకుంది..  సదస్సు రెండో రోజున మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో రూ. 860 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులతో ఎంఓయూలు, రూ. 336 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులతో జీవోల మార్పిడి జరిగింది.అందులో భాగంగా కివా హటల్ అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్(కుప్పం), బాపురం గ్రాండ్ హోటల్స్(కర్నూలు), హిల్లోరా ఎకో రిసార్ట్ (కృష్ణాపురం, విజయనగరం), జీఏఆర్ ఎంటర్ ప్రైజెస్ ఎల్ఎల్ పీ (రాజమహేంద్రవరం), రేడియన్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్ పీ( విజయనగరం), శ్రీవెన్ గ్రూప్ ఎల్ఎల్ పీ(విశాఖపట్నం), పీఆర్ హోటల్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్(విశాఖపట్నం), ఎంటీజే ప్రైవేట్ లిమిటెడ్ (విశాఖపట్నం), శ్రీ సిద్దార్థ ఇన్ ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (విశాఖ), న్యూ ఏజ్ మీడియా పార్ట్ నర్ ప్రైవేట్ లిమిటెడ్(వివిధ జిల్లాల్లో)ఎంవోయూలు జరిగాయి.. అదే విధంగా తిరుపతిలో ఆర్ కే2 ఇన్ ఫ్రాస్ట్రక్చర్, దైవిక్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో జీవో ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు..

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 'పారిశ్రామిక హోదా' కల్పించారని గుర్తుచేశారు. దీనివల్ల పరిశ్రమలకు వర్తించే అన్ని రాయితీలు టూరిజం ఇన్వెస్టర్లకు అందుతున్నాయని, ఫలితంగా గడిచిన రెండున్నరేళ్లలో దేశవిదేశాల నుండి సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని గదులు నిర్మించామన్న దానికంటే.. స్థానిక నిరుద్యోగ యువతకు, మహిళలకు ఎంతమేర ఉపాధి లభిస్తుందన్నదే తమకు ముఖ్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కేవలం ప్రకృతి అందాలకే పరిమితం కాకుండా, మన ఘనమైన సంస్కృతికి, అద్భుతమైన ఆతిథ్యానికి ఒక సజీవ నిదర్శనమని, ఇక్కడ వేసే ప్రతి అడుగు ఒక మధురానుభూతిని మిగులుస్తుందని మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో అభివర్ణించారు.. రాష్ట్రంలో విస్తారమైన అటవీ ప్రాంతాలు, అందమైన గిరిజన ప్రాంతాలు కూడా పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయని, జీవనోపాధి కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ స్థానిక సమూహాలను బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.కల్నరీ, హస్తకళలు, టూరిస్ట్ గైడ్ల ద్వారా క్షేత్రస్థాయిలోని సామాన్యుడి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హోటల్స్, రిసార్ట్స్, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ క్రమంలో

'అథెంటిసిటీ, హ్యూమన్ వార్మ్త్, అతిథి దేవోభవ' అనే విధానాలతో పాటు 'గ్లోబల్ స్టాండర్డ్స్ విత్ లోకల్ కల్చర్' నినాదంతో ముందుకు వెళ్తున్నామని, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ప్రాజెక్టులో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారనే అంశాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ఏపీ ఒక 'అందమైన పర్యాటక గమ్యస్థానం' అని, ఇక్కడి నుండి గొప్ప జ్ఞాపకాలను మీ వెంట తీసుకెళ్లాలని ఇన్వెస్టర్లను కోరారు. మనం ఎంత అభివృద్ధి సాధించినా, హిమాలయ స్థాయి ఎత్తుకు ఎదిగినా కూడా అంతిమంగా క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యుడికి లబ్ధి జరిగినప్పుడే దాని ఫలితం నెరవేరినట్లుగా భావిస్తామని ఆయన తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  అరకు కాఫీ, కలంకారీ కళ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు ఏపీకి గర్వకారణమని తెలిపారు. సముద్రతీరంతో పాటు అరకు, లంబసింగి, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేద ఆధారిత 'వెల్‌నెస్ సెంటర్ల' ఏర్పాటుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. 'అతిథి దేవోభవ' నినాదంతో సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.1,053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం, అరకు వ్యాలీ, లంబసింగి, గండికోట, కోనసీమ, గోదావరి-కృష్ణా నదీతీరాలు, బౌద్ధ ఆరామాలతో యావత్ భారతదేశాన్ని ఏపీలోనే దర్శించుకోవచ్చని అభివర్ణించారు.

రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలలో నిర్వహించిన 5 ప్రాంతీయ సదస్సుల ద్వారా 50 ప్రాజెక్టులు, సీఐఐ సమ్మిట్ ద్వారా 12 ప్రాజెక్టులతో కలిపి పర్యాటక శాఖ మొత్తంగా 62 ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదుర్చుకుందని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 7,287.30 కోట్ల పర్యాటక పెట్టుబడులు (ఇందులో సీఐఐ సమ్మిట్ వాటా రూ. 1,114.92 కోట్లు) రానుండగా, తద్వారా 5,000కు పైగా హోటల్ గదుల వసతితో పాటు 46,853 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, కార్యదర్శి ఆమ్రపాలి కాట, టూరిజం ఎండీ పట్టాన్‌శెట్టి రవి సుభాష్,ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ఇన్వెస్టర్లకు 'ఏపీ పర్యాటక పాలసీ 2024-29' రాయితీలను వివరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, అధికారులు సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు.