గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి... * రాంపల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం ప్రారంభం పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ o oi
సూర్య - పెద్దపల్లి రూరల్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ సూచించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు మండలంలోని రాంపల్లి లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, తూకం, చెల్లింపులపై రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తర్వాత చందపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి బస్తాల తూకాన్ని పరిశీలించారు. ప్రతి ధాన్యం బస్తాను 41 కిలోల బరువుతోనే తూకం వేయాలని అన్నారు . కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపత్‌రావు, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్లు జూపల్లి తిరుపతిరావు, పిన్‌రెడ్డి సుధాకర్‌రెడ్డి, దొనేటి రామ్మోహన్ స్వరూప, పీఏసీఎస్ సీఈఓ మధన్‌మోహన్, రైతులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.