BREAKING
నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు శిక్షణ నగర సంకీర్తనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే, 20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కీలకం ఘనంగా నాగుల చవితి జేఎన్‌టీయూఏలో పారిశ్రామిక పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.. కూలిపోయిన ఇండ్లు ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం సింగరేణి ఉద్యోగం కోల్పోయి మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య రత్నాపూర్‌లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్ యూత్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. రెండు స్వర్ణాలతో అదరగొట్టిన అంబేకర్, గుంజన్ మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన వివాన్ కపూర్.. 2028 ఒలింపిక్స్ కోటా కైవసం

ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య

Select Suryaa Now
ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు  విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి  లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య

 

లింగాల: విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, ఇతర సృజనాత్మక రంగాల్లోనూ రాణించాలని జడ్.పి.హెచ్.ఎస్. లింగాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కొండయ్య అన్నారు. శుక్రవారం లింగాల మండల కేంద్రంలో ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో ఏరియా లెవల్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెంచు విద్యార్థుల విద్యాభివృద్ధి, వారి ప్రతిభను వెలికితీయడంలో ఆర్డీటీ సంస్థ ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. విద్యార్థులకు అవసరమైన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తూ వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. చదువులోనే కాకుండా కళలు, సృజనాత్మక కార్యక్రమాల్లోనూ ఆసక్తి కనబరిచి తమ గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్‌కు లింగాల మండలంలోని ఎర్రపెంట, బల్మూర్ మండలం కొండానాగుల, కొల్లాపూర్ మండలం నార్లపూర్ గ్రామాలకు చెందిన చెంచు విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల్లోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ప్లే మోడల్, రంగోలి, నేచర్ కొలాజ్, హ్యాండ్ రైటింగ్, పిక్చర్ పెయింటింగ్, పేపర్ కటింగ్, ఎన్విరాన్‌మెంట్ ప్లాంటేషన్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. హ్యాండ్ రైటింగ్‌లో ఎన్. గంగా మొదటి, సి. అంజలి రెండో బహుమతి సాధించారు. డ్రాయింగ్‌లో వర్షిణి మొదటి, హరీష్ రెండో బహుమతి పొందారు. పేపర్ కటింగ్‌లో నవీన్ మొదటి, సంజన రెండో బహుమతి గెలుచుకున్నారు. రంగోలిలో కృష్ణవేణి మొదటి, తేజస్విని రెండో బహుమతి సాధించారు. నేచర్ కొలాజ్‌లో శ్రీనిక మొదటి, వేణమ్మ రెండో బహుమతి పొందారు. ఎన్విరాన్‌మెంట్ ప్లాంటేషన్‌లో వర్షిణి మొదటి, భాను ప్రకాష్ రెండో బహుమతికి ఎంపికయ్యారు. అనంతరం విజేతలకు మొదటి, రెండో బహుమతులు అందజేయడంతో పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులు అందించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పురుషోత్తం, ఆర్డీటీ ఏపీసీ శారద, రీజనల్ ఇంజనీర్ శేఖర్, సీఓ పాషా, రాములు, హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, మంగమ్మ, అంజలి, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు..