స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : ఫ్యూచర్ సిటీలో సిటీలో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. యువతకు నైపుణ్య ఆధారిత విద్యను అందించడంతోపాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు స్కిల్ యూనివర్సిటీ కీలక కేంద్రంగా నిలవనుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడంలో ఈ యూనివర్సిటీ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్