BREAKING
మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు శిక్షణ నగర సంకీర్తనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే, 20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కీలకం ఘనంగా నాగుల చవితి జేఎన్‌టీయూఏలో పారిశ్రామిక పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.. కూలిపోయిన ఇండ్లు ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం సింగరేణి ఉద్యోగం కోల్పోయి మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య రత్నాపూర్‌లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్ యూత్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. రెండు స్వర్ణాలతో అదరగొట్టిన అంబేకర్, గుంజన్ మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన వివాన్ కపూర్.. 2028 ఒలింపిక్స్ కోటా కైవసం జపాన్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్

కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : కేఎల్ఆర్

Select Suryaa Now
కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : కేఎల్ఆర్

(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : లోన్ యాప్ కంపెనీల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న 8వ బెటాలియన్ కానిస్టేబుల్ మూడావత్ శ్రీను కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని హర్షగూడ గ్రామానికి చెందిన శ్రీను కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్యను ఓదార్చి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు తీసుకున్న వారిని ఫోన్ కాల్స్, బెదిరింపులు, మానసిక వేధింపులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి వేధింపుల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.

లోన్ యాప్ సంస్థల అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని, అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వడ్ల శ్రీనివాస చారి :  రంగారెడ్డి - మేజర్ న్యూస్